Road Accident: విశాఖలో రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ల మృతి

software engineers dies in accident
  • స్నేహితుడిని కలిసి, తిరిగి వెళుతున్న మిత్రులు  
  • బైక్‌ను ఢీకొట్టిన గుర్తు తెలియ‌ని వాహ‌నం
  • పీఎం పాలెం క్రికెట్ స్టేడియం సమీపంలో ఘటన 
  • మృతుల పేర్లు ధనరాజ్, కె.వినోద్ ఖన్నా
విశాఖ నగరంలో రోడ్డు మీద ఇద్ద‌రు సాఫ్ట్ ‌వేర్ ఇంజనీర్లు విగత జీవులుగా క‌న‌ప‌డ‌డం క‌ల‌క‌లం రేపింది. సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్లు వెళ్తున్న‌ బైక్‌ను పీఎం పాలెం క్రికెట్ స్టేడియం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జ‌రిగి వారు మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది.

మృతుల పేర్లు ధనరాజ్, కె.వినోద్ ఖన్నాగా పోలీసులు గుర్తించారు. ధనరాజ్ ఇన్ఫోసిస్‌లో ప‌నిచేస్తుండ‌గా, వినోద్ మ‌రో సాప్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వారిద్ద‌రు పనోరమ హిల్స్‌లో‌ ఉన్న స్నేహితుడిని కలిసి తిరిగి త‌మ ఇళ్ల‌కు బైకుపై వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని చెప్పారు. వారిని గుర్తు తెలియ వాహ‌నం ఢీ కొట్టిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు.
Road Accident
Vizag

More Telugu News