చిక్కుల్లో అల్లు అర్జున్... తెలంగాణ ఆర్టీసీ లీగల్ నోటీసులు

  • ర్యాపిడో బైక్ ట్యాక్సీ యాడ్ లో నటించిన బన్నీ
  • దోసెలు వేస్తూ కనిపించిన నటుడు
  • బస్సులో వెళితే మసాలా దోసె చేసేస్తారని వ్యాఖ్యలు
  • బైక్ ట్యాక్సీ ఎక్కాలని సూచన
Telangana RTC decide to send legal notice to Allu Arjun and Rapido

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా రాపిడో బైక్ ట్యాక్సీ యాడ్ లో నటించారు. ఈ యాడ్ కారణంగా ఇప్పుడాయన చిక్కుల్లో పడ్డారు. అల్లు అర్జున్ కు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం లీగల్ నోటీసులు పంపించాలని నిర్ణయించింది. ఆ యాడ్ లో అల్లు అర్జున్ ఓ హోటల్లో దోసెలు వేస్తుంటారు. ఓ వ్యక్తి రాగా, అతడికి బైక్ ట్యాక్సీలో ప్రయాణం సుఖంగా ఉంటుందని, ఆర్టీసీ సిటీ బస్సులో ఎక్కితే కుర్మా వేసి ఖీమా కొట్టి మసాలా దోసెలా చేసేస్తారని చెబుతారు. ర్యాపిడో బైక్ ట్యాక్సీ ఎక్కాలని అతడిని బన్నీ ప్రోత్సహిస్తారు.

అయితే ఈ యాడ్ పై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ బస్సులను, సంస్థ సేవలను కించపరిచేలా యాడ్ ఉందని, ఇలాంటి ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. నటులు, ఇతర సెలబ్రిటీలు ఇలాంటి వాణిజ్య ప్రకటనల్లో నటించేటప్పుడు ఆలోచించుకోవాలని సూచించారు. ర్యాపిడో యాడ్ లో నటించిన యాక్టర్ కు, సదరు బైక్ ట్యాక్సీ సంస్థకు నోటీసులు పంపించనున్నామని తెలిపారు.

More Telugu News