Teja Sajja: డిస్నీ హాట్ స్టార్ కి 'అద్భుతం' .. ఆసక్తిని పెంచుతున్న ట్రైలర్!

Asdbhutham Trailer Released
  • తేజ సజ్జా తాజా చిత్రంగా 'అద్భుతం'
  • కథానాయికగా శివాని రాజశేఖర్
  • ఇంట్రస్టింగ్ గా అనిపిస్తున్న ట్రైలర్  
  • ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్  
తేజ సజ్జా హీరోగా 'అద్భుతం' సినిమా రూపొందింది. శివాని రాజశేఖర్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మించిన ఈ సినిమాకి, మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

హీరో ఫోన్ నెంబర్ .. హీరోయిన్ ఫోన్ నెంబర్ ఒకటే కావడం .. అదే వాళ్ల పరిచయానికి కారణం కావడం .. అనే అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఇందులో అద్భుతం ఏముంది? అనే సందేహం ట్రైలర్ పూర్తయ్యేలోగా చాలామందికి వస్తుంది. అందుకనే డైరెక్టర్ అక్కడే ట్విస్ట్ ఇచ్చాడు.

హీరోకి హీరోయిన్ కనిపించదు .. బెంచ్ పై ఆమె రాస్తున్న అక్షరాలు మాత్రం కనిపిస్తుంటాయి. ఇదేదో సైన్స్ ఫిక్షన్ లా ఉందే అని మనం అనుకునేలోగానే, హీరోతోనే ఆ మాట అనిపించేశారు. స్క్రీన్ ప్లే - సంభాషణలు లక్ష్మీభూపాల్ అందించిన ఈ సినిమా, ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.
Teja Sajja
Shivani Rajasekhar
Mallik Ram

More Telugu News