Chiranjeevi: 'భోళా శంకర్' కోసం వెయిట్ చేయడం నా వల్లకాదు: తమన్నా

Tamanna in Mehar Ramesh Movie
  • మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళా శంకర్'
  • చిరంజీవి సరసన నాయికగా తమన్నా
  • గతంలో 'సైరా' జోడీగా చేసిన అనుభవం
  • తనని ఎంపిక చేయడం పట్ల తమన్నా హర్షం

చిరంజీవి తన కెరియర్లో ఇంతవరకూ ఒక సినిమా తరువాతనే మరో సినిమాను పట్టాలెక్కిస్తూ వచ్చారు. కానీ ఈ సారి మాత్రం ఆయన వరుసగా మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. ఆల్రెడీ మోహన్ రాజాతో 'గాడ్ ఫాదర్' చేస్తున్న ఆయన, ఆ తరువాత మెహర్ రమేశ్ తో 'భోళా శంకర్' .. బాబీ దర్శకత్వంలో 'వాల్తేర్ వాసు' చేయనున్నారు.

మెహర్ రమేశ్ సినిమాలో కథానాయికగా తమన్నాను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అనుకున్నట్టుగా ఆమెనే కథానాయికగా ఖరారు చేశారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఆమె పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ విడుదల చేయడం పట్ల తమన్నా తనదైన శైలిలో స్పందించింది.

మెగా మాసివ్ మూవీ 'భోళా శంకర్' సినిమాలో భాగమైనందుకు ఆనందంగా .. గౌరవంగా ఉంది. చిరంజీవిగారితో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎక్కువ సమయం వేచి ఉండలేను .. త్వరగా సెట్స్ పైకి తీసుకురండి మెహర్ రమేశ్ గారు " అంటూ ట్వీట్ చేసింది. ఇంతకుముందు ఆమె చిరంజీవి సరసన నాయికగా 'సైరా' చేసిన సంగతి తెలిసిందే. 'భోళా శంకర్' ఈ నెల 11వ తేదీన పూజా కార్యక్రమాలను జరుపుకుని, 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. 

  • Loading...

More Telugu News