Errabelli: సభ కోసం 1500 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశాం: ఎర్రబెల్లి దయాకర్ రావు

Parking arrangement done in 1500 acres for Vijaya Gharjana Sabha says Errabelli Dayakar Rao
  • విజయగర్జన సభకు 12 లక్షల మంది హాజరవుతారు
  • సభ కోసం స్థలాలను ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు
  • మహా ధర్నాను అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విజయవంతం చేయాలి
బీజేపీతో గొడవ పెట్టుకోవాలనే ఆలోచన తమకు లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అయితే రైతులకు అన్యాయం చేసేలా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతరేకంగా మాత్రం పోరాడతామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు.

ఇక వరంగల్ లో నిర్వహించే విజయగర్జన సభకు 12 లక్షల మంది హాజరవుతారని చెప్పారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎర్రబెల్లి తెలిపారు. పార్కింగ్ కోసం 1500 ఎకరాల్లో ఏర్పాట్లు చేశామని చెప్పారు. సభాప్రాంగణం వద్ద మరో 100 ఎకరాలను సేకరిస్తున్నామని అన్నారు. సభ కోసం స్థలాలను ఇచ్చిన దేవన్నపేట, కోమటిపల్లి రైతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు వరంగల్ కు వస్తున్నారని ఎర్రబెల్లి తెలిపారు. హనుమకొండలోని జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న మహా ధర్నాను అన్ని నియోజకవర్గ కేంద్రాలలో విజయవంతం చేయాలని కోరారు.
Errabelli
KCR
TRS
Vijaya Gharjana Sabha
Warangal

More Telugu News