నా సలహాలు వింటున్నట్టు కేసీఆర్ నటిస్తున్నారు: షబ్బీర్ అలీ
- కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే
- దళితుడిని సీఎం చేయలేదనే విషయాన్ని ఒప్పుకున్నారు
- దళిత సీఎం గురించి ఎప్పుడు మాట్లాడుకున్నామో కేసీఆర్ చెప్పాలి
అయితే, ఈ వ్యవహారంలో తన పేరును లాగడం సరికాదని చెప్పారు. అసలు దళిత ముఖ్యమంత్రి గురించి ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నామో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు. తాను ఇచ్చే సలహాలను వింటున్నట్టు కేసీఆర్ నటిస్తున్నారని మండిపడ్డారు. మీరు చెప్పిన మాటల్లో నిజం ఉంటే... తన సలహాలను మీరు వినేటట్టయితే... వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి, దళితుడికి ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించాలని అన్నారు.