Bhopal: ప్రభుత్వాసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అప్పుడే పుట్టిన నలుగురు చిన్నారుల మృతి

Four Newborns Killed In Hospital Fire
  • మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో అగ్నిప్రమాదం
  • షార్ట్ సర్క్యూట్ వల్ల న్యూ బోర్న్ వార్డులో అగ్నిప్రమాదం
  • తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ప్రభుత్వాసుపత్రిలో మనసులు చలించిపోయే విషాదకర ఘటన చోటుచేసుకుంది. కమలా నెహ్రూ పిల్లల ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించి అప్పుడే పుట్టిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే ఆసుపత్రిలోని స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదం నలుగురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది.

ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య, విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ మాట్లాడుతూ... ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఇతరులతో కలిసి తాను వెంటనే ఆసుపత్రికి వెళ్లానని చెప్పారు. వార్డు లోపల మొత్తం పొగలతో నిండిపోయి ఉందని తెలిపారు. వార్డులో ఉన్న చిన్నారులను పక్కన ఉన్న మరో వార్డులోకి తరలించామని చెప్పారు.

ఆసుపత్రిలోని మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించిందని.... ఎనిమిది నుంచి పది ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయని ఫైర్ స్టేషన్ అధికారి తెలిపారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన చిన్నారుల ప్రాణాలను కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని తెలిపారు.
Bhopal
Hospital
Fire Accident
Newborns
Death

More Telugu News