Jai Bhim: ‘జై భీమ్’ చూసి చలించిపోయిన రాఘవ లారెన్స్.. ‘సినతల్లి’కి ఇల్లు నిర్మించి ఇస్తానని ప్రకటన

Raghava Lawrence promises house for Parvathi
  • 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన ‘జై భీమ్’
  • దర్శకుడు జ్ఞానవేల్‌పై ప్రశంసలు
  • పార్వతమ్మ పోరాటం ఆశ్చర్యపరిచిందన్న లారెన్స్
28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ప్రముఖ నటుడు సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా దేశవ్యాప్తంగా హిట్ టాక్ సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన ప్రముఖ దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ స్పందించారు. దర్శకుడు జ్ఞానవేల్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయనను మనసారా అభినందిస్తున్నట్టు చెప్పారు.

 అలాగే, చేయని నేరానికి చిత్రహింసలకు గురై మృతి చెందిన రాజాకన్ను కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పారు. ఆయన భార్య పార్వతమ్మ (సినతల్లి)కి ఇల్లు కట్టి ఇస్తానని హామీ ఇచ్చారు. పార్వతమ్మ పోరాటాన్ని చూసి తాను ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. ఆమెకు తప్పకుండా మంచి ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.
Jai Bhim
Suriya
Raghava Lawrence
Parvatamma

More Telugu News