సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

09-11-2021 Tue 07:30
  • సమంతకు అరుదైన గౌరవం 
  • 'భోళాశంకర్' ఓపెనింగ్ వివరాలు 
  • మైసూర్లో 'బంగార్రాజు' షూటింగ్  
Samantha invited to address International Film Festival
*  అందాలతార సమంతకు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 20 నుంచి గోవాలో జరిగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రసంగించాల్సిందిగా ఆమెకు ఆహ్వానం అందింది. అలాగే, చిత్రోత్సవ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ తో కలిసి సమంత వ్యాఖ్యానం కూడా చేస్తుంది.
*  మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందే 'భోళాశంకర్' చిత్రం షూటింగ్ ముహూర్తం ఈ నెల 11 ఉదయం 7.45 నిమిషాలకు హైదరాబాదులో జరుగుతుంది. ఈ విషయాన్ని దర్శకుడు మెహర్ రమేశ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అలాగే 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన 'వేదాళం' చిత్రానికి ఇది రీమేక్.
*  నాగార్జున హీరోగా రూపొందుతున్న 'బంగార్రాజు' చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ నేటి నుంచి మైసూర్ లో జరుగుతోంది. ఇందుకోసం హీరో నాగార్జున, దర్శకుడు కల్యాణ్ కృష్ణ తదితరులు నిన్న సాయంకాలం మైసూర్ కి చార్టెడ్ ఫ్లయిట్ లో చేరుకున్నారు.