అసైన్డ్ భూముల వ్యవహారంలో ఈటలకు మళ్లీ నోటీసులు
- ఈటలపై అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలు
- గత జూన్ లోనే నోటీసులు
- కరోనా కారణంగా నిలిచిన విచారణ
- హైకోర్టు ఆదేశాలతో కదిలిన అధికారులు
- ఈ నెల 16 నుంచి మళ్లీ విచారణ
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నిలిచిన విచారణను అధికారులు హైకోర్టు ఆదేశాలతో పునఃప్రారంభించనున్నారు. ఈ నెల 16 నుంచి హకీంపేట, అచ్చంపేట భూముల్లో సర్వే చేపట్టనున్నారు.
హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో ఈటల అసైన్డ్ భూములను ఆక్రమించినట్టు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన మంత్రి పదవిని కోల్పోవడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం జరిగాయి.