D Arvind: కేసీఆర్ కచ్చితంగా జైలుకు వెళతారు: బీజేపీ ఎంపీ అర్వింద్

KCR will definitely go to jail says D Arvind
  • కేసీఆర్ చేసిన అవినీతే ఆయనను జైలుకు పంపిస్తుంది
  • హుజూరాబాద్ ఓటమిని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారు
  • సీఎం పదవికి రాజీనామా చేసి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవడం మంచిది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో ఒక రోజు కచ్చితంగా జైలుకు పోకతప్పదని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆయన చేసిన అవినీతే ఆయనను జైలుకు పంపిస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన అవినీతిపై ఆధారాలు ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తామని చెప్పారు.

కేసీఆర్ కు మతిమరుపు ఎక్కువైందని అర్వింద్ అన్నారు. ఆయనిక సీఎం పదవికి రాజీనామా చేసి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవడం బెటర్ అని చెప్పారు. వరి ధాన్యాన్ని కొనబోమని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. రైస్ మిల్లులను ఆధునికీకరించుకోవాలని మాత్రమే రాష్ట్రానికి రాసిన లేఖలో కేంద్రం పేర్కొందని చెప్పారు.
 
హుజూరాబాద్ లో సర్వశక్తులను ఒడ్డినా, కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఓటమిపాలు కావడాన్ని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని అర్వింద్ అన్నారు. బీజేపీ సాధించిన ఘన విజయం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారని చెప్పారు.
D Arvind
BJP
KCR
TRS

More Telugu News