Balakrishna: క్రిష్ దర్శకత్వంలో మోక్షజ్ఞ?

Mokshagna in krish movie
  • తెరపైకి మళ్లీ మోక్షజ్ఞ పేరు 
  • మనసు మారిందంటూ ప్రచారం 
  • నటన దిశగా అడుగులు 
  • త్వరలోనే వెలువడనున్న ప్రకటన
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా రానున్నాడనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తున్నదే. అందుకు సంబంధించిన కథలను బాలకృష్ణ వింటున్నారని చెప్పుకున్నారు. ఆ తరువాత ఒక సందర్భంలో మోక్షజ్ఞ ఫొటో ఒకటి బయటికి వచ్చింది. ఆయన ఫిట్ గా లేకపోవడంతో సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదనే టాక్ వచ్చింది.

మోక్షజ్ఞను హీరోగా చేయడానికి బాలకృష్ణ ఉత్సాహంగా ఉన్నప్పటికీ, అతనికి నటన పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేదని ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు మాత్రం మోక్షజ్ఞ మనసు మారిందనీ, సినిమాలు చేసే దిశగా కసరత్తు మొదలుపెట్టాడని అంటున్నారు. గతంలో మోక్షజ్ఞను అనిల్ రావిపూడి దర్శకత్వంలో పరిచయం చేయాలనుకున్నారు.

కానీ ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో మోక్షజ్ఞను పరిచయం చేయనున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు ఇది 'ఆదిత్య 369'కి సీక్వెల్ కావొచ్చని అంటున్నారు. 'హరిహర వీరమల్లు' తరువాత ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మొదలవుతాయని చెబుతున్నారు. ఈ  ప్రచారంలో ఎంతవరకూ వాస్తవముందనేది చూడాలి మరి.
Balakrishna
Mokshagna
Krish

More Telugu News