Degala Babji: బండ్ల గణేశ్ 'డేగల బాబ్జీ' ట్రైలర్ ను ఆవిష్కరించనున్న పూరీ జగన్నాథ్

Puri Jagannadh will launch Degala Babji theatrical trailer tomorrow
  • బండ్ల గణేశ్ ప్రధాన పాత్రలో డేగల బాబ్జీ
  • తమిళ చిత్రానికి తెలుగులో రీమేక్ 
  • వెంకట్ చంద్ర దర్శకత్వంలో చిత్రం
  • రేపు ఉదయం ట్రైలర్ విడుదల
ప్రముఖ హాస్య నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ప్రధానపాత్ర పోషిస్తున్న చిత్రం 'డేగల బాబ్జీ'. తమిళంలో పార్తిబన్ హీరోగా వచ్చిన 'ఒత్తు సెరుప్పు సైజ్ 7' చిత్రాన్ని తెలుగులో 'డేగల బాబ్జీ'గా రీమేక్ చేస్తున్నారు. యశ్ రిషి ఫిలింస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా 'డేగల బాబ్జీ' చిత్రం ట్రైలర్ రేపు ఉదయం 9.35 గంటలకు విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ట్రైలర్ ను ఆవిష్కరించనున్నారు.

ఈ సినిమా టైటిల్ పోస్టర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. బండ్ల గణేశ్ నటిస్తుండడం, పైగా తమిళంలో ప్రజాదరణ పొందిన చిత్రం కావడంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.
Degala Babji
Trailer
Puri Jagannadh
Bandla Ganesh
Tollywood

More Telugu News