మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి దశదిన కర్మకు హాజరైన సీఎం కేసీఆర్

07-11-2021 Sun 14:55
  • గత నెలలో శ్రీనివాస్ గౌడ్ కు మాతృవియోగం
  • నేడు మహబూబ్ నగర్ లో దశదిన కర్మ
  • శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించిన సీఎం కేసీఆర్
  • శ్రీనివాస్ గౌడ్ తల్లి సమాధి వద్ద నివాళులు
CM KCR attends minister Srinivas Goud mother ritual
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ ఇటీవల కన్నుమూశారు. ఆమె దశదిన కర్మను నేడు మహబూబ్ నగర్ లో నిర్వహించగా, సీఎం కేసీఆర్ హాజరయ్యారు. శాంతమ్మ సమాధి వద్ద ఆయన నివాళులు అర్పించారు. మాతృవియోగంతో బాధపడుతున్న మంత్రివర్గ సహచరుడ్ని ఓదార్చారు. శ్రీనివాస్ గౌడ్ కుటుంబసభ్యులను పరామర్శించారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ అక్టోబరులో గుండెపోటుతో మరణించారు. ఆమె అంత్యక్రియలు మహబూబ్ నగర్ లోని సొంత వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు.