ప‌వ‌న్ క‌ల్యాణ్ 'భీమ్లా నాయ‌క్' నుంచి టైటిట్ సాంగ్ విడుద‌ల‌.. అద‌ర‌హో అనేలా పాట రాసిన‌ త్రివిక్ర‌మ్

07-11-2021 Sun 12:13
  • పవన్ కల్యాణ్, రానా హీరోలుగా మల్టీస్టార‌ర్ సినిమా
  • సాగర్ కె చంద్ర  దర్శకత్వం
  • అల‌రిస్తోన్న టైటిల్ సాంగ్
  • లాలా భీమ్లా  అంటూ పాట‌
Pawan Kalyan bheemla naik song releases
మ‌ల్టీస్టార‌ర్ మూవీ భీమ్లా నాయ‌క్ నుంచి టైటిల్ సాంగ్ విడుద‌లైంది. పవన్ కల్యాణ్, రానా ఈ సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియుమ్' కి రీమేక్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. లాలా భీమ్లా అంటూ కొన‌సాగుతోన్న ఈ పాట అభిమానుల‌ను అల‌రిస్తోంది.

ఈ పాట‌కు సాహిత్యం త్రివిక్ర‌మ్ అందించారు. థ‌మన్ అద్భుత‌మైన మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలోని కొన్ని సీన్ల‌కు సంబంధించిన ఫొటోల‌ను కూడా ఈ వీడియోలో చూపించారు. ఈ సినిమాలో పవన్ సరసన  నిత్యా మీనన్, రానా స‌ర‌స‌న   సంయుక్త మీనన్ న‌టిస్తోంది. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.