ఒక్క ఫొటోతో విడాకుల వార్త‌ల‌కు చెక్ పెట్టిన హీరోయిన్‌ ప్రియమణి

07-11-2021 Sun 11:46
  • త‌న‌ భర్త ముస్తాఫా రాజ్ కు విడాకులు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం
  • వారిద్ద‌రూ కొంత కాలంగా దూరంగా ఉంటున్నార‌ని వార్త‌లు
  • భ‌ర్త‌తో దీపావ‌ళికి దిగిన ఫొటో పోస్ట్ చేసిన ప్రియ‌మ‌ణి
priyamani gives clarity with pic
హీరోయిన్ ప్రియమణి త‌న‌ భర్త ముస్తాఫా రాజ్ కు విడాకులు ఇవ్వ‌నున్న‌ట్లు ఇటీవ‌ల బాగా ప్ర‌చారం జ‌రుగుతోంది. వారిద్ద‌రూ కొంత కాలంగా దూరంగా ఉంటున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని ముస్తాఫా మొదటి భార్య అయేషా ఇటీవ‌ల‌ తెలిపింది.

ప్రియమణితో అతడి వివాహం చెల్లదని చెప్పింది. దీంతో  ముస్తాఫా రాజ్ కు ప్రియ‌మ‌ణి విడాకులు ఇస్తుంద‌న్న ప్ర‌చారం ఊపందుకుంది. ఈ వార్త‌ల‌కు ప్రియమణి ఒక్క ఫొటోతో చెక్ పెట్టింది. దీపావళి సందర్భంగా ఇటీవ‌ల త‌న‌ భర్త ముస్తాఫా రాజ్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. భర్తతో క‌లిసి ఉన్న‌ట్లు  పరోక్షంగా తెలిపింది.

అలాగే, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తోనూ ఫొటోలు దిగింది. కాగా, ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని 2017లో ప్రియమణి ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ప్రియ‌మ‌ణి సినిమాల‌తో పాటు 'ఫ్యామిలీ మేన్' వంటి వెబ్‌సిరీస్‌లలోనూ న‌టిస్తోంది.