South Africa: ఇంగ్లండ్ పై శివమెత్తిన వాన్ డర్ డుస్సెన్... దక్షిణాఫ్రికా స్కోరు 189/2

South Africa posts huge total against England
  • సెమీస్ బెర్తు కోసం తీవ్ర పోరు
  • గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన సఫారీలు
  • 60 బంతుల్లో 94 పరుగులు చేసిన వాన్ డర్ డుస్సెన్
  • 25 బంతుల్లో 52 పరుగులు చేసిన మార్ క్రమ్
సెమీస్ బెర్తు కోసం ఆస్ట్రేలియాతో పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇంగ్లండ్ తో చావోరేవో తేల్చుకునేందుకు బరిలో దిగిన దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 194 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇంత భారీ స్కోరు చేసిందంటే అందుకు కారణం వన్ డౌన్ బ్యాట్స్ మన్ వాన్ డర్ డుస్సెన్ విధ్వంసక ఇన్నింగ్సే.

వాన్ డర్ డుస్సెన్ 60 బంతుల్లో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 5 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. అతడికి మార్ క్రమ్ కూడా తోడవ్వడంతో సఫారీ స్కోరుబోర్డు దూసుకెళ్లింది. మార్ క్రమ్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 52 పరుగులు చేశాడు. అంతకుముందు ఓపెనర్ డికాక్ 34 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 2 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ 1, అదిల్ రషీద్ 1 వికెట్ తీశారు.
South Africa
England
T20 World Cup
Semis

More Telugu News