Ramcharan: "ఇందులో నేనే హీరోయిన్ అండీ" అంటూ రామ్ చరణ్ ను ఆశ్చర్యానికి గురిచేసిన యాంకర్ సుమ... వీడియో ఇదిగో!

Ramcharan unveils anchor Suma movie poster
  • మళ్లీ వెండితెరపై కనిపించనున్న సుమ
  • సుమ ప్రధానపాత్రలో 'జయమ్మ పంచాయితీ'
  • విజయ్ కుమార్ కాలివరపు దర్శకత్వంలో చిత్రం
  • ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరించిన రామ్ చరణ్
బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా కొనసాగుతున్న సుమ గతంలో సినిమాల్లోనూ నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె వెండితెరపై కనిపించనున్నారు. సుమ ప్రధానపాత్రలో 'జయమ్మ పంచాయితీ' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు విజయ్ కుమార్ కాలివరపు దర్శకత్వం వహిస్తున్నాడు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశ్ నిర్మిస్తున్నారు.

కాగా, 'జయమ్మ పంచాయితీ' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆవిష్కరించారు. రామ్ చరణ్ ఈ చిత్రం గురించి సుమను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇందులో హీరోయిన్ ఎవరండీ అని రామ్ చరణ్ అడగ్గా, నేనేనండీ అంటూ సుమ జవాబిచ్చింది. ఆఁ... అంటూ రామ్ చరణ్ ఆశ్చర్యపోయారు. అనంతరం చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
Ramcharan
Anchor Suma
Jayamma Panchayithi
First Look
Tollywood

More Telugu News