అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ... తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేత

06-11-2021 Sat 18:11
  • ఈ నెల 14న సదరన్ జోనల్ సమావేశం
  • తిరుపతి వేదికగా కీలక భేటీ
  • హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల సీఎంలు
  • శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం
TTD decides to halt VIP Break darshans in Tirumala
తిరుపతిలో ఈ నెల 14న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ సీఎంలు పాల్గొననున్నారు. సదరన్ జోనల్ సమావేశం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి బ్రేక్ దర్శనాలు మూడ్రోజుల పాటు రద్దు చేసింది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేసింది. ఈ నెల 12, 13, 14 తేదీల్లో సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.