Allu Arjun: అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థానంలో అల్లు అర్జున్ సొంత సినిమా హాల్... పూజా కార్యక్రమాల ఫొటోలు ఇవిగో!

Allu Arjun owned Ameerpet Sathyam Theater and builds new one named AAA Cinemas
  • సినిమా హాల్ నిర్మిస్తున్న బన్నీ
  • ఏషియన్ సినిమాస్ సంస్థతో భాగస్వామ్యం
  • పూజా కార్యక్రమాలకు హాజరైన బన్నీ, సునీల్ నారంగ్ తదితరులు
  • సోషల్ మీడియాలో ఫొటోలు
సినిమా ప్రేమికులకు అమీర్ పేట సత్యం థియేటర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాదు నడిబొడ్డున ఉండే ఈ థియేటర్ స్థానంలో ఇప్పుడు కొత్త థియేటర్ నిర్మితమవుతోంది. కొత్త హాల్ యజమాని ఎవరో కాదు... టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా థియేటర్ పేరు 'AAA సినిమాస్'. ఇది ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మితమవుతోంది. అందుకే అల్లు అర్జున్ పేరు కలిసొచ్చేలా 'ట్రిపుల్ ఏ'గా నామకరణం చేశారు.

ఇవాళ అమీర్ పేటలో పూజా కార్యక్రమాలు జరగ్గా, అల్లు అర్జున్, సునీల్ నారంగ్, నారాయణ్ దాస్ నారంగ్ తదితరులు హాజరయ్యారు. కాగా, బన్నీ సినిమా థియటర్ కు సంబంధించి ట్రిపుల్ ఏ లోగో కూడా డిజైన్ చేశారు.

టాలీవుడ్ లో ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో సూపర్ స్టార్ మహేశ్ బాబు, యువ హీరో విజయ్ దేవరకొండ కూడా సొంత థియేటర్లను కలిగివుండడం తెలిసిందే. ఏఎంబీ సినిమాస్ పేరిట మహేశ్ బాబు గచ్చిబౌలిలో సినిమా థియేటర్ నిర్మించగా, విజయ్ దేవరకొండ ఏవీడీ సినిమాస్ పేరుతో మహబూబ్ నగర్ లో సినిమా థియేటర్ నిర్మించారు.
Allu Arjun
AAA Cinemas
Ameerpet
Sathyam Theater
Hyderabad
Tollywood

More Telugu News