Andhra Pradesh: బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో ఈ నెల 11, 12 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
  • ఈ నెల 9న బంగాళాఖాతంలో అల్పపీడనం
  • వాయవ్య దిశగా కదలనున్న అల్పపీడనం
  • మత్స్యకారులకు హెచ్చరికలు
Heavy to heavy rainfall alert for AP

దేశంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా, ఈ నెల 9న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తం కొనసాగుతోందని, ఈ నెల 9 నాటికి అది అల్పపీడనంగా మారనుందని వివరించింది. క్రమేపీ అది బలపడి వాయవ్య దిశగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ, దక్షిణ కోస్తాంధ్రలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

ఈ నెల 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 9, 10వ తేదీల్లో తమిళనాడులోనూ... 10, 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్రలోనూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ నెల 9 లోపు తీరప్రాంతాలకు చేరుకోవాలని స్పష్టం చేసింది.

More Telugu News