Virat Kohli: డ్రెస్సింగ్ రూములో కోహ్లీ బర్త్ డే వేడుకలు.. అంతా తానే అయిన ధోనీ

MS Dhoni leads Virat Kohlis birthday celebrations
  • ఇండియన్ డ్రెస్సింగ్ రూములో వేడుకలు
  • దగ్గరుండి ఏర్పాట్లు చేసిన ధోనీ
  • తొలుత ధోనీకే కేక్ తినిపించిన కోహ్లీ
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ బర్త్ డే వేడుకలను మాజీ సారథి, టీ20 ప్రపంచకప్ మెంటార్ మహేంద్రసింగ్ ధోనీ అంతా తానే అయి నిర్వహించాడు. ఇండియన్ డ్రెస్సింగ్ రూములో జరిగిన ఈ వేడుకలకు ధోనీ దగ్గరుండి ఏర్పాట్లు చేశాడు. కేండిల్స్ వెలిగించాడు. కేకును ఏర్పాటు చేసి కోహ్లీతో దగ్గరుండి కట్ చేయించాడు. సహచరులతో కలిసి బర్త్ డే విషెస్ చెప్పాడు. కోహ్లీ తొలుత ధోనీకే కేక్ తినిపించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. స్కాట్లాండ్‌పై అద్భుత విజయం అనంతరం ఈ వేడుకలు జరిగాయి. సహచరులు సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి పోస్టు చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో కోహ్లీ ముఖంపై కేక్ పూసివున్నట్టు కనిపించింది.
Virat Kohli
MS Dhoni
Birth Day
BCCI
Team India

More Telugu News