DRDA: జిల్లా గ్రామీణాభివృద్థి పథకానికి కేంద్రం మంగళం.. రాష్ట్రాలకు లేఖ

  • వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి డీఆర్‌డీఏ పథకాన్ని నిలిపివేస్తున్న కేంద్రం
  • ఆ పథకాన్ని జిల్లా పరిషత్/జిల్లా పంచాయతీల్లో విలీనం చేయాలని సూచన
  • డిప్యుటేషన్ సిబ్బందిని మాతృశాఖకు పంపాలంటూ లేఖలు
Union Government removes DRDA Scheme

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) పథకానికి కేంద్రం మంగళం పాడింది. ఈ పథకాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎత్తేస్తున్నట్టు చెబుతూ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. డీఆర్‌డీఏ పథకాన్ని నిలిపివేస్తుండడంతో దానిని జిల్లా పరిషత్, లేదంటే జిల్లా పంచాయతీల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సంజయ్ కుమార్ ఆ లేఖల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.

 జిల్లా పరిషత్‌లు లేని ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం జిల్లా కౌన్సిల్, లేదంటే ఇతర సంస్థల్లో ఈ పథకాన్ని విలీనం చేయాలని సూచించారు. అలాగే, డీఆర్‌డీఏలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న సిబ్బందిని మాతృశాఖకు పంపాలని, మిగతా వారిని జిల్లా ప్రణాళిక, పర్యవేక్షణ విభాగం, ఉపాధిహామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం వంటి ఏదో ఒక దాంట్లో సర్దుబాటు చేయాలని సంజయ్ కుమార్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.

More Telugu News