Navjot Singh Sidhu: రాజీనామాను వెనక్కి తీసుకుంటూ.. కాంగ్రెస్ కు అల్టిమేటం జారీ చేసిన సిద్ధూ!

  • రాష్ట్రానికి కొత్త అడ్వొకేట్ జనరల్ ను నియమించాలి
  • ఆ తర్వాతే నేను ఆఫీసులో అడుగు పెడతాను
  • సహోతా లాంటి వ్యక్తి డీజీపీగా ఎలా ఉంటారు?
Sidhu issues ultimatum to congress

పంజాబ్ పీసీసీ పదవికి చేసిన రాజీనామాను నవజ్యోత్ సింగ్ సిద్ధూ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆయన సరికొత్త అల్టిమేటం జారీ చేశారు. రాష్ట్రానికి కొత్త అడ్వొకేట్ జనరల్ ను నియమించిన తర్వాతే తాను ఆఫీసులో అడుగు పెడతానని స్పష్టం చేశారు.

పీసీసీకి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకున్నానని... అయితే, కొత్త ఏజీని నియమించిన తర్వాతే తన కార్యాలయంలో అడుగుపెడతానని చెప్పారు. సుమేధ్ సైనీకి బెయిల్ ఇప్పించిన వ్యక్తి ఏజీ ఎలా అవుతాడని, సహోతా లాంటి ఐపీఎస్ అధికారి డీజీపీగా ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాలను సీఎం దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పారు.

More Telugu News