Ananya Pandey: తెలుగు తెరకు పరిచయమవుతున్న కొత్త అందాలు!

New heroines for upcoming movies
  • దూసుకుపోతున్న కృతి శెట్టి
  • జోరు పెంచుతున్న శ్రీలీల
  • రొమాంటిక్ గా మార్కులు కొట్టేసిన కేతిక
  • లైన్లో మరింతమంది ముద్దుగుమ్మలు  
తెలుగు తెర అందమైన కథానాయికల అక్షయ పాత్ర. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల నుంచి కొత్త కథానాయికలు తెలుగు తెరకి పరిచయమవుతూనే ఉంటారు. అందంతో పాటు కాస్త అభినయం కూడా తెలిసుంటే చాలు, తెలుగు ప్రేక్షకులు ఆకాశమంతటి అభిమానాన్ని చూపిస్తారు. కాస్త కథాబలం ఉన్న సినిమాలు చేస్తే చాలు స్టార్ హీరోయిన్స్ రేసులో నిలబెట్టేస్తారు. ప్రేక్షకుల నుంచి లభించే క్రేజ్ .. కథానాయికల రేంజ్ కి కొలమానమవుతుంది.

అలాంటి కథానాయికలకు వరుస అవకాశాలు లభిస్తాయి. మార్కెట్ తో పాటు పారితోషికం కూడా పెరుగుతుంది. ఇటీవల 'ఉప్పెన' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టినే అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకే ఒక్క సినిమాతో ఈ అమ్మాయి చిన్న హీరోలకు .. చిన్న సినిమాలకు అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఇక ఆ తరువాత 'పెళ్లి సందD'తో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల దూకుడు కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఈ సందడిలోనే 'రొమాంటిక్'తో వచ్చిన కేతిక శర్మ కుర్రాళ్లకు కుదురులేకుండా చేసింది.

ఇక త్వరలో తెరకి పరిచయం కానున్న కథానాయికల జాబితా కూడా పెద్దదిగానే ఉంది. 'ఖిలాడి'తో మీనాక్షి చౌదరి .. 'రాజా విక్రమార్క'తో తాన్య రవిచంద్రన్ .. 'లైగర్'తో అనన్య పాండే .. 'భీమ్లా నాయక్' తో సంయుక్త మీనన్ .. 'ఏజెంట్' సినిమాతో సాక్షి వైద్య .. ఇలా ఇంకొందరు పరిచయమవుతున్నారు. మరి వీరిలో అందాల సందడితో .. ఆకర్షణీయమైన అభినయంతో ఆకట్టుకునేదెవరో .. కుర్రాళ్ల హృదయాలను హోల్ సేల్ గా కొల్లగొట్టేదెవరో చూడాలి.
Ananya Pandey
Meenakshi Choudary
Sakshi Vaidya

More Telugu News