Roja: హుషారుగా వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే రోజా... ఫొటోలు ఇవిగో!

  • నవంబరు 17న రోజా పుట్టినరోజు
  • క్రీడాపోటీలు నిర్వహిస్తున్న రోజా చారిటబుల్ ట్రస్టు
  • పుత్తూరు మండలంలో వాలీబాల్ పోటీలు
  • ప్రారంభించిన రోజా
Roja plays Volleyball in Puthur

చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం ఎస్ఆర్ఎస్ కళాశాలలో వాలీబాల్ టోర్నమెంట్ ను నగరి ఎమ్మెల్యే రోజా నేడు ప్రారంభించారు. ఆమె తన సోదరుడితో కలిసి కాసేపు వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా రోజా ఎంతో హుషారుగా కనిపించడమే కాకుండా, ఆటగాళ్లలోనూ ఉత్సాహం నింపారు. ఈ వాలీబాల్ పోటీలను రోజా పుట్టినరోజు (నవంబరు 17)ను పురస్కరించుకుని నిర్వహిస్తున్నారు. వాలీబాల్ మాత్రమే కాకుండా ఇతర క్రీడాంశాల్లోనూ పోటీలు నిర్వహిస్తున్నారు.

తాను వాలీబాల్ ఆడిన సందర్భంగా ఫొటోలను రోజా సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా ఈ క్రీడా పోటీలు రోజా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.

More Telugu News