పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్ద కన్నీటి పర్యంతమైన తమిళ హీరో సూర్య
- కొన్నిరోజుల కిందట పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత
- గుండెపోటుతో మరణించిన నటుడు
- అంత్యక్రియలకు రాలేకపోయిన సూర్య
- నేడు పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్ద నివాళులు
ఈ సందర్భంగా సూర్య భావోద్వేగాలను అదుపు చేసుకోలేక కంటతడి పెట్టారు. అంత్యక్రియలకు రాలేకపోయానంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ కూడా సూర్య వెంట ఉన్నారు. ఆయన కూడా తమ్ముడి మరణం తాలూకు బాధ నుంచి ఇంకా తేరుకోలేదనడానికి నిదర్శనంగా చెమర్చిన కళ్లతో కనిపించారు.
కన్నడ చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ గా, అప్పుగా అందరి మెప్పు పొందిన పునీత్ రాజ్ కుమార్... భాషలకు అతీతంగా అందరితోనూ స్నేహపూర్వకంగా మెలిగేవారు. ఆయన మరణంతో అన్ని దక్షిణాది చిత్ర పరిశ్రమలు కదిలిపోయాయి.