Adisankaracharyulu: సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 14 ఆలయాల్లో ఆదిశంకరాచార్యుల సంస్మరణోత్సవాలు

  • ఇంద్రకీలాద్రిపై నాడు శ్రీచక్రాన్ని ప్రతిష్టించిన జగద్గురు
  • నేడు సంస్మరణోత్సవం
  • పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
  • ఆదిశంకరాచార్యులు దైవస్వరూపులని వెల్లడి
Adisankaracharyulu memorial celebrations at Vijayawada Indrakeeladri

ఆంధ్రప్రదేశ్ లోని 14 ఆలయాలను జగద్గురు ఆదిశంకరాచార్యులు సందర్శించినట్టుగా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన సందర్శించిన ఆలయాల్లో సంస్మరణ ఉత్సవాలు చేపట్టారు. దీనిపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన ఆదిశంకరాచార్యుల సంస్మరణ ఉత్సవాల్లో మంత్రి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదిశంకరాచార్యులు సందర్శించిన ఆలయాల్లో సీఎం జగన్ ఆదేశాల మేరకు సంస్మరణ ఉత్సవాలు నిర్వహించినట్టు వెల్లడించారు. ఆదిశంకరాచార్యులు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్టించారని తెలిపారు. ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు భగవంతుని స్వరూపమేనని అన్నారు. అటు, కేదార్ నాథ్ లో ఆదిశంకరాచార్యుల సంస్మరణ ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించడం హర్షణీయం అని వెల్లంపల్లి పేర్కొన్నారు.

More Telugu News