Bihar: బీహార్‌లో విషాదం.. కల్తీమద్యం తాగి రెండు రోజుల్లో 24 మంది మృతి

  • బీహార్‌లో అమల్లో ఉన్న మద్య నిషేధం
  • గోపాల్‌గంజ్‌లో 16 మంది, తెల్హువాలో 8 మంది మృతి
  • ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసే కుట్రగా అభివర్ణించిన మంత్రి
  • దర్యాప్తు జరుపుతున్న మూడు బృందాలు
24 dead in bihar as drinking hooch

మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్‌లో కల్తీ మద్యం తాగి రెండు రోజుల్లో 24 మంది చనిపోగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని గోపాల్‌గంజ్‌లో జరిగిందీ ఘటన. చంపారన్ జిల్లా తెల్హువా గ్రామంలో నిన్న 8 మంది చనిపోగా, గోపాల్‌గంజ్‌లో 16 మంది మృత్యువాత పడ్డారు.

తెల్హువాలో ఇలాంటి ఘటన జరగడం గత 10 రోజుల్లో ఇది మూడోసారి. సమాచారం అందుకున్న వెంటనే గోపాల్‌గంజ్ చేరుకున్న మంత్రి జనక్ రామ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు జరుగుతున్న కుట్రగా దీనిని అభివర్ణించారు.

గోపాల్‌గంజ్ ఎస్‌పీ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలోని ముహమ్మద్‌పూర్ గ్రామంలో గత రెండు రోజులుగా పలువురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్టు చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చే వరకు వారి మృతికి గల కారణాలను చెప్పలేమన్నారు. ఈ ఘటనపై మూడు బృందాలు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

More Telugu News