Muhurat Trading: దీపావళి మూరత్ ట్రేడింగ్ ప్రారంభం... దేశీయ మార్కెట్లలో జోష్

Diwali Migurat Trading starts
  • ఆనవాయతీ ప్రకారం మూరత్ ట్రేడింగ్
  • లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
  • 340 పాయింట్ల లాభంతో సెన్సెక్స్
  • రాత్రి 7.15 గంటల వరకు ట్రేడింగ్

దీపావళి సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లలో మూరత్ ట్రేడింగ్ నిర్వహించడం ఆనవాయతీ. దీపావళి నాడు సాయంత్రం పూట కొన్ని గంటల పాటు నిర్వహించే ఈ ట్రేడింగ్ శుభాలను కలిగిస్తుందని కంపెనీలు, మదుపరుల్లో నమ్మకం ఉంది. కాగా నేడు మూరత్ ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే దేశీయ మార్కెట్ల లావాదేవీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 340 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో ముందంజ వేశాయి. ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐఓసీ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. నేటి రాత్రి 7.15 గంటల వరకు మూరత్ ట్రేడింగ్ సాగనుంది.

  • Loading...

More Telugu News