అప్పుడు సారా తాగా.. ఇప్పుడు కాస్త మంచి విస్కీ తాగుతున్నా: బాలయ్య 'అన్ స్టాపబుల్' లో మోహన్ బాబు

04-11-2021 Thu 16:56
  • బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ టాక్ షో
  • ఆహా ఓటీటీలో ప్రసారం
  • ప్రారంభ ఎపిసోడ్ కు విచ్చేసిన మోహన్ బాబు
  • ఆసక్తికర అంశాలు పంచుకున్న వైనం
Mohan Babu opines on his drinking habit
తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో మోహన్ బాబుది ఓ ప్రత్యేక అధ్యాయం. విలన్ పాత్రలతో మొదలుపెట్టి హీరోగా, నిర్మాతగానూ ఎదిగారు. డైలాగులు చెప్పడంలో తనకంటూ ఓ శైలిని ఏర్పరచుకున్నారు. తాజాగా ఆయన బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోకి విచ్చేశారు. అందులో అనేక ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. తన మద్యం అలవాటు గురించి కూడా ఆయన వివరించారు.

మద్రాసులో కెరీర్ ఆరంభించిన రోజుల్లో తాను సారా తాగేవాడ్నని వెల్లడించారు. కోడంబాకం బ్రిడ్జి కింద కొన్ని సారా దుకాణాలు ఉండేవని, ఓ స్నేహితుడితో కలిసి వెళ్లి తాగేవాడ్నని తెలిపారు. కెరీర్ ఆశాజనకంగా లేని రోజుల్లోనూ తాగానని అన్నారు. ఇప్పుడు దేవుడు తనకు మంచి జీవితాన్ని ఇచ్చాడని, దాంతో కాస్త మంచి విస్కీ తాగుతున్నానని మోహన్ బాబు పేర్కొన్నారు.