Ummareddy Venkateshwarlu: రాజధాని రైతులు తిరుపతికి కాదు.. చంద్రబాబు ఇంటికి పాదయాత్ర చేయాలి!: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

Ummareddy Venkateshwarlu fires on Chandrababu
  • అమరావతి రైతుల సమస్యలకు చంద్రబాబు కారణం కాదా?
  • రాజధాని రైతుల పొలాలను బలవంతంగా తీసుకున్నది చంద్రబాబు కాదా?
  • చంద్రబాబు ఇంటికి పాదయాత్ర చేయాలి
  • కేసులు వేసి అభివృద్ధిని ఆపుతున్నది చంద్రబాబే

అమరావతి రైతులు మహాపాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. 'న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు' పేరుతో వారు చేపట్టిన పాదయాత్ర తిరుపతిలో ముగియనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శలు గుప్పించారు.

అమరావతి రైతుల సమస్యలకు చంద్రబాబు కారణం కాదా? అని ప్రశ్నించారు. ఆనాడు పేదలకు ఇచ్చిన పొలాలను, స్థలాలను బలవంతంగా జీవోలు ఇచ్చి తీసుకున్నది చంద్రబాబు కాదా? అని అడిగారు. రాజధాని రైతులు తిరుపతికి కాకుండా చంద్రబాబు ఇంటికి పాదయాత్ర చేస్తే ఆయనకు బుద్ధి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కోర్టుల్లో కేసులు వేసి ఆపుతున్నది చంద్రబాబేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News