Chiranjeevi: కె.విశ్వనాథ్ ని కలిసి, ఆశీర్వాదాలు తీసుకున్న చిరంజీవి దంపతులు.. వీడియో ఇదిగో!

Chranjeevi takes blessings of K Vishwanath
  • దీపావళి సందర్భంగా తన గురువు విశ్వనాథ్ ఇంటికి వెళ్లిన మోగాస్టార్
  • కొత్త వస్త్రాలు, మిఠాయిలు అందించిన చిరంజీవి
  • కుటుంబ సభ్యులతో గడిపిన చిరంజీవి దంపతులు
దీపావళి పర్వదినం సందర్భంగా అందరూ చాలా సంతోషంగా గడుపుతున్నారు. సెలబ్రిటీలందరూ తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ తమ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. మరోవైపు తాను గురువుగా భావించే కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇంటికి చిరంజీవి వెళ్లారు. పండుగ సందర్భంగా సతీసమేతంగా విశ్వనాథ్ ఇంటికి వెళ్లారు. వెళ్లగానే ఆయన పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా విశ్వనాథ్ దంపతులకు కొత్త వస్త్రాలను బహూకరించారు. మిఠాయిలు అందించారు. విశ్వనాథ్ కుటుంబసభ్యులతో కలసి కాసేపు సరదాగా గడిపారు. వీరి కలయికకు సంబంధించిన పొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికి వస్తే చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఆచార్య' చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించింది.
Chiranjeevi
K Vishwanath
Blessings
Tollywood

More Telugu News