YS Sharmila: 108కి ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో.. తన కాన్వాయ్ లోని అంబులెన్స్ ను పంపించిన షర్మిల

YS Sharmila calls 108 and gets no responce
  • మర్రిగూడ సమీపంలోని క్యాంప్ లో బస చేసిన షర్మిల
  • సమీపంలో యాక్సిడెంట్ కు గురైన రెండు బైకులు
  • విషయం తెలిసి స్వయంగా 108కి ఫోన్ చేసిన షర్మిల
వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల చేపట్టిన 'ప్రజా ప్రస్థానం' పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర ప్రస్తుతం మర్రిగూడ వద్దకు వచ్చింది. పాదయాత్ర సందర్భంగా ఆమె మర్రిగూడ సమీపంలో ఉన్న క్యాంప్ లో బస చేశారు. అయితే క్యాంప్ కు సమీపంలో ఓ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. రెండు బైక్ లు ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయాలతో రోడ్డుపై పడిపోయారు.

ఈ విషయం షర్మిల దృష్టికి రాగా... వెంటనే స్వయంగా 108 అంబులెన్స్ కు ఆమె ఫోన్ చేశారు. అయితే అరగంట సేపు వేచి చూసినా అంబులెన్స్ రాలేదు. దీంతో, ఆమె హుటాహుటిన తన కాన్వాయ్ లోని అంబులెన్స్ ను ఘటనా స్థలికి పంపారు. క్షతగాత్రులను ఆ అంబులెన్స్ లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. మరోవైపు షర్మిల స్పందించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.
YS Sharmila
YSRTP
Accident
Ambulance

More Telugu News