Shahrukh Khan: షారుఖ్ కు బర్త్ డే విషెస్ ఎందుకు చెప్పలేదన్న ప్రశ్నకు కాజోల్ సమాధానం ఇదే!

Kajol answer for not greeting Shahrukh Khan on his birthday
  • గత మంగళవారం పుట్టినరోజు జరుపుకున్న షారుఖ్
  • ఆర్యన్ కు బెయిల్ రావడంతో షారుఖ్ ఆశలు ఫలించాయన్న కాజోల్
  • షారుఖ్ గురించి ఇంతకన్నా  ఏం కోరుకోవాలని ప్రశ్న
బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, కాజోల్ జంటకు సూపర్ హిట్ పెయిర్ గా గుర్తింపు ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ ను కొల్లగొట్టాయి. వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఇప్పటికీ కొనసాగుతోంది. గత మంగళవారం షారుఖ్ తన 56వ పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు ఆయనకు విషెస్ తెలిపారు.

అయితే కాజోల్ మాత్రం ఆయనకు విషెస్ చెప్పలేదు. ఇది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశం గురించి ఒక నెటిజన్ కాజోల్ ను ప్రశ్నించాడు. షారుఖ్ కు గ్రీటింగ్స్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించాడు. ఆర్యన్ ఖాన్ బెయిల్ పై విడుదల కావడంతో షారుఖ్ ఆశలన్నీ ఫలించాయని... షారుఖ్ గురించి ఇంతకంటే నేనేం కోరుకోవాలని ప్రశ్నించింది.
Shahrukh Khan
Kajol
Bollywood
Birthday

More Telugu News