Prabhas: 'ఆదిపురుష్' అంత తొందరగానా?

  • ప్రభాస్ కెరియర్లో తొలి పౌరాణికం 
  • వందల కోట్ల బడ్జెట్ తో నిర్మాణం 
  • చకచకా జరుగున్న షూటింగు 
  • ఆగస్టుకు సినిమా రావడం ఖాయమే 
Adi Purush movie Update

ప్రభాస్ కెరియర్లో ఇంతవరకూ చేసిన సినిమాల లెక్క వేరు .. 'ఆది పురుష్' దారి వేరు. రామాయణ కథా కావ్యానికి ఇది దృశ్య రూపం. ప్రభాస్ చేస్తున్న తొలి పౌరాణిక చిత్రం. బాలీవుడ్లో భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా ఇది. టి - సిరీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ ..సీతాదేవిగా కృతి సనన్ ..  రావణుడిగా సైఫ్ అలీఖాన్ .. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు.

వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను ఓం రౌత్ రూపొందిస్తున్నాడు. రామాయణం కథా వస్తువుగా ఇంతవరకూ వచ్చిన సినిమాలకు మించి ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పడం మరింతగా అంచనాలను పెంచింది. ఈ సినిమా కోసం ఇటు అయోధ్య .. అటు లంకానగరం .. మధ్యలో కిష్కింధ సెట్లు భారీస్థాయిలో వేయవలసి ఉంటుంది. వేల సంఖ్యలో కనిపించే వానర సైన్యానికి భారీ స్థాయిలో కాస్ట్యూమ్స్ అవసరమవుతాయి. ఒక గడువులో .. ఒక నిడివిలో దీనిని పూర్తి చేయడం కష్టం.  

అందువలన ఇప్పట్లో ఈ సినిమా సెట్స్ పై నుంచి బయటికి రావడం కష్టమే అనుకున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11వ తేదీన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినా, అప్పటికి థియేటర్లకు రావడం అసాధ్యమేనని చెప్పుకున్నారు. కానీ ఓం రౌత్  ప్లానింగ్ మామూలుగా లేదు. ఆల్రెడీ కృతి సనన్ పోర్షన్  ను .. సైఫ్ అలీఖాన్ పోర్షన్ ను కానిచ్చేసిన ఆయన, నిన్నటితో ప్రభాస్ పోర్షన్ ను కూడా పూర్తి చేసి షాక్ ఇచ్చాడు. ఇదంతా కూడా చాలా తక్కువ గ్యాప్ లో జరిగిపోవడం ఆశ్చర్యకరం. ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ పై నమ్మకం బలపడుతోంది. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News