Shahrukh Khan: షారుఖ్ ఖాన్ కు లేఖ రాసిన రాహుల్ గాంధీ.. లేఖలో ఏముందంటే..!

Rahul Gandhi written letter to Shahrukh Khan
  • ఆర్యన్ జైలుకు వెళ్లిన ఆరు రోజులకు రాహుల్ లేఖ
  • దేశం మొత్తం మీ వెంట ఉందన్న రాహుల్
  • బెయిల్ పై జైలు నుంచి విడుదలైన ఆర్యన్
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. తన కుమారుడి అరెస్ట్ తో షారుఖ్ తల్లడిల్లిపోయారు. అదే సమయంలో షారుఖ్ కు శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఆర్యన్ జైల్లో ఉన్న సమయంలో షారుఖ్ కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆర్యన్ ఖాన్ జైలుకు వెళ్లిన ఆరు రోజులకు షారుఖ్ కు రాహుల్ లేఖ రాశారు. 'దేశం మొత్తం మీ వెంట ఉంది' అని లేఖలో రాహుల్ చెప్పారు. 23 ఏళ్ల ఆర్యన్ కు బాంబే హైకోర్టు అక్టోబర్ 28న బెయిల్ మంజూరు చేసింది. గత శనివారం జైలు నుంచి ఆర్యన్ బెయిల్ పై విడుదలయ్యాడు. అక్టోబర్ 2న క్రూయిజ్ షిప్ పై ఎన్సీబీ జరిపిన దాడిలో ఆర్యన్ అరెస్టయ్యాడు. అప్పటి నుంచి దాదాపు నాలుగు వారాల పాటు ఆయన జైల్లో గడిపాడు.
Shahrukh Khan
Bollywood
Rahul Gandhi
Congress
Letter

More Telugu News