Kalyan Dev: రేపు 'సూపర్ మచ్చి' నుంచి టీజర్ రిలీజ్!

  • కల్యాణ్ దేవ్ హీరోగా 'సూపర్ మచ్చి'
  • కథానాయికలుగా రియా - రచితా రామ్
  • సంగీత దర్శకుడిగా తమన్
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
Supar Machi teaser release on 4th November

కల్యాణ్ దేవ్ హీరోగా దర్శకుడు పులి వాసు 'సూపర్ మచ్చి' సినిమాను రూపొందించాడు. రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమా, ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. కానీ కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో ఈ నెల చివరిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి రేపు మ్యూజికల్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు. రేపు ఉదయం 11:11 నిమిషాలకు ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. తమన్ స్వరపరిచిన ఈ సినిమాలో కథానాయికలుగా రియా చక్రవర్తి - రచితా రామ్ సందడి చేయనున్నారు.

ఈ సినిమా విడుదల కోసమే కల్యాణ్ దేవ్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఈ సారి మాస్ ఆడియన్స్ కి కూడా చేరువ కావాలనే ఉద్దేశంతో ఆయన ఈ కథను ఎంచుకున్నాడు. మరి ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఆయన కొత్త ప్రాజెక్టులను లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు.

More Telugu News