హుజూరాబాద్ లో బీజేపీ ఎక్కడుంది? అది ముమ్మాటికీ ఈటల గెలుపే: రేణుకా చౌదరి

03-11-2021 Wed 17:39
  • హుజూరాబాద్ లో గెలిచింది బీజేపీ కాదు
  • ఈటల గెలుపు కోసం స్థానిక నేతలు కూడా పని చేశారు
  • ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేసుకుంటున్నాం
It was purely Etela win says Renuka Chowdary
హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. ఈ విజయాన్ని బీజేపీ శ్రేణులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాయి. మరోవైపు ఈటలకు కాంగ్రెస్ మద్దతు పలికిందంటూ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కాక పుట్టిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి మాట్లాడుతూ... రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవే అయినా... ఆయన బయట మాట్లాడకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పార్టీకి సంబంధించిన అంశాలను పార్టీ వేదికపైనే మాట్లాడాలని చెప్పారు.

హుజూరాబాద్ లో గెలిచింది బీజేపీ కాదని... అది ముమ్మాటికీ ఈటల గెలుపేనని రేణుకా చౌదరి అన్నారు. ఈటల గెలుపు కోసం స్థానిక నేతలు కూడా పని చేశారని చెప్పారు. హుజూరాబాద్ లో బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేసుకుంటున్నామని చెప్పారు.