'సర్కారువారి పాట' కొత్త రిలీజ్ డేట్ ఇదే!

03-11-2021 Wed 17:19
  • ముగింపు దశలో 'సర్కారువారి పాట'
  • కథానాయికగా కీర్తి సురేశ్
  • హైదరాబాద్ లో చివరి షెడ్యూల్
  • జనవరి 13 నుంచి ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా
Sarkaru Vaari Paata movie update
మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ .. 14 రీల్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. మహేశ్ బాబు కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. బ్యాంక్ కి సంబంధించిన భారీ స్కామ్ చుట్టూ ఆసక్తికరంగా నడిచే కథ ఇది.

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ జనవరి 7వ తేదీన 'ఆర్ ఆర్ ఆర్' వస్తుండటంతో, ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకుంది. ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నామనే విషయాన్ని ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు.

తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. ఇంతవరకూ దుబాయ్ .. గోవా .. స్పెయిన్ లలో షూటింగు జరుపుకున్న ఈ సినిమా, హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్ తో చిత్రీకరణను పూర్తిచేసుకోనుంది. మహేశ్ బాబు వరుస హిట్లతో ఉన్న కారణంగా సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.