మోహన్ బాబును విమర్శించిన నటి శ్రీనిజపై సస్పెన్షన్ వేటువేసిన 'మా'
- అసోసియేషన్ సభ్యుల ప్రమాణస్వీకారం రోజున మోహన్ బాబు, నరేశ్ లపై శ్రీనిజ వ్యాఖ్యలు
- అక్టోబర్ 16న నోటీసులిచ్చిన ఈసీ
- ఆమె ఇచ్చిన సమాధానం తృప్తిగా లేదంటూ సస్పెన్షన్
అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ అక్టోబర్ 16వ తేదీన ఈసీ ఆమెకు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే ఆమె ఇచ్చిన సమాధానం సంతృప్తిగా లేదంటూ ఆమెను అసోషియేషన్ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేశారు.