Ram Charan: పునీత్​ రాజ్ కుమార్ లేడనే విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నా: రామ్ చరణ్

Ram Charan meets Puneet Rajkumar family
  • గుండెపోటుతో మృతి చెందిన పునీత్ రాజ్ కుమార్
  • పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన చరణ్
  • తాను కలిసిన గొప్ప వ్యక్తుల్లో పునీత్ ఒకరని కితాబు

కన్నడ సినీ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్ల చిన్న వయసులో మృతి చెందడం అందరినీ కలచివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయన మరణాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఆయనను చివరిసారి చూసేందుకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి 10 లక్షలకు పైగా జనం వచ్చారంటే ఆయనపై ప్రజల్లో ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు.

తెలుగు సినీ హీరోలతో కూడా పునీత్ కు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేశ్, శ్రీకాంత్ తదితరులు బెంగళూరుకు వెళ్లి నివాళులు అర్పించారు. తాజాగా రామ్ చరణ్ కూడా అక్కడకు వెళ్లి... పునీత్ కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అప్పు (పునీత్) లేడనే విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని అన్నారు. తాను కలిసిన మంచి వ్యక్తుల్లో పునీత్ ఒకరని కొనియాడారు. సినీ పరిశ్రమకు, సమాజానికి పునీత్ ఎంతో చేశారని అన్నారు. మా ఇంటికి గెస్ట్ గా వచ్చి మమ్మల్నే అతిథులుగా ఫీల్ అయ్యేలా చేశారని చెప్పారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం పునీత్ అని కొనియాడారు.

  • Loading...

More Telugu News