Huzurabad: రూ. 25 కోట్లకు బీజేపీకి రేవంత్ అమ్ముడుపోయారు: టీఆర్ఎస్ నేత కౌశిక్‌రెడ్డి

Revanth Reddy Sold congress Ticket to bjp for 25 crores
  • దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీ చేశాయి
  • అప్పుడు నాకు 62 వేలకు పైగా ఓట్లు వచ్చాయి
  • ఇప్పుడు బల్మూరి ఎక్స్‌ట్రా ప్లేయర్‌గా మిగిలిపోయారు
హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం తర్వాత టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ టికెట్‌ను బీజేపీకి రూ. 25 కోట్లకు అమ్మేశారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీచేయడం దేశంలో ఎక్కడా లేదని, కానీ హుజూరాబాద్‌లో జరిగిందని అన్నారు.

 ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు 62 వేలకుపైగా ఓట్లు పోలయ్యాయని, కానీ, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ ప్రధాన పార్టీగా బరిలోకి దిగినప్పటికీ చివరికి బల్మూరి వెంకట్ ఎక్స్‌ట్రా ప్లేయర్‌గా నిలిచిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ నేతల నుంచి ఆయనకు పూర్తిస్థాయి సహకారం లభించలేదన్నారు. ఆయన కోసం ప్రచారం చేసేందుకు ఒక్కరు కూడా రాలేదని, చివరికి రెండు పొట్టేళ్ల మధ్య నలిగిపోయిన లేగదూడ పరిస్థితి ఆయనకు ఎదురైందని కౌశిక్ విమర్శించారు.
Huzurabad
Padi Kaushik Reddy
Revanth Reddy
Congress
TRS

More Telugu News