South Africa: టీ20 వరల్డ్ కప్: బంగ్లాదేశ్ ను ఇంటిముఖం పట్టించిన దక్షిణాఫ్రికా

  • అబుదాబిలో దక్షిణాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్
  • 6 వికెట్ల తేడాతో నెగ్గిన సఫారీలు
  • పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకిన దక్షిణాఫ్రికా
  • ఆడిన 4 మ్యాచ్ లలోనూ ఓటమిపాలైన బంగ్లాదేశ్
South Africa sends Bangladesh packing out of world cup

టీ20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా మరో విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్ తో గ్రూప్-1 మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌట్ అయింది.

స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు 13.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరారు. ఈ క్రమంలో 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేశారు. కెప్టెన్ టెంబా బవుమా 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. వాన్ డర్ డుస్సెన్ 22, డికాక్ 16 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, మెహదీ హసన్ 1, నసుమ్ అహ్మద్ 1 వికెట్ తీశారు.

కాగా, ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ తర్వాత రెండోస్థానంలో నిలిచింది. సఫారీలు సూపర్-12 దశలో ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు, ఒక ఓటమి నమోదు చేశారు. అటు, బంగ్లాదేశ్ ఆడిన 4 మ్యాచ్ లలోనూ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

More Telugu News