Etela Rajender: 21 వేలు దాటిన ఈటల రాజేందర్ ఆధిక్యం!

Etela Rajender crosses 21000 votes majority
  • 21,015 ఓట్ల లీడింగ్ లో ఈటల రాజేందర్
  • మరో రెండు రౌండ్ల లెక్కింపు మాత్రమే మిగిలి ఉన్న వైనం
  • బీజేపీకి ఇప్పటి వరకు పడిన ఓట్లు 96,581
ఇరు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నెలలుగా ఉత్కంఠను రేకెత్తించిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. 20వ రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై ఆయన 21,015 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. 20వ రౌండ్ లో ఈటలకు 1474 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో బీజేపీకి 96,581 ఓట్లు, టీఆర్ఎస్ కు 75,566 ఓట్లు, కాంగ్రెస్ కు 2,767 ఓట్లు పడ్డాయి. మరో రెండు రౌండ్ల లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది. ఈ రెండు రౌండ్లు ఈటల రాజేందర్ మండలానికి సంబంధించినవి కావడం గమనార్హం.
Etela Rajender
BJP
Huzurabad
Results

More Telugu News