టీ20 వరల్డ్ కప్: 84 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్

  • అబుదాబిలో దక్షిణాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్
  • చెరో మూడు వికెట్లు తీసిన రబాడా, నోర్జే
  • బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో నలుగురు డకౌట్
Bangladesh collapsed for a low score against South Africa

దక్షిణాఫ్రికాతో గ్రూప్-1 పోరులో బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ పేలవ ప్రదర్శన కనబర్చారు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అబుదాబిలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది. సఫారీ పేసర్లు కగిసో రబాడా, ఆన్రిచ్ నోర్జే చెరో 3 వికెట్లతో బంగ్లాదేశ్ ను వణికించారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో మెహదీ హసన్ చేసిన 27 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఓపెనర్ లిటన్ దాస్ 24 పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో నలుగురు డకౌట్ అయ్యారు. ఇతర సఫారీ బౌలర్లలో షంసీ 2, ప్రిటోరియస్ 1 వికెట్ తీశారు.

More Telugu News