Etela Rajender: దూసుకుపోతున్న ఈటల రాజేందర్.. మూడో రౌండ్ లో కూడా బీజేపీ లీడ్!

Etela Rajender leads after third round in Huzurabad
  • మూడో రౌండ్ లో ఈటలకు 906 ఓట్ల లీడ్
  • 1,273 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్న ఈటల
  • హుజూరాబాద్ మున్సిపాలిటీలో బీజేపీదే హవా
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల ప్రారంభ ట్రెండ్స్ బీజేపీకి అనుకూలంగా వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పైచేయి సాధిస్తున్నారు. తొలి రెండు రౌండ్లలో లీడ్ సాధించిన ఈటల రాజేందర్ మూడో రౌండ్ లో సైతం ఆధిక్యతను సాధించారు. మూడో రౌండ్ లో 906 ఓట్ల లీడ్ ఈటల సాధించారు.

ఈ మూడు రౌండ్లలో కలిపి 1,273 ఓట్ల మెజార్టీలో ఈటల కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ కు బలమైన పట్టు ఉన్న హుజూరాబాద్ మున్సిపాలిటీ ప్రాంతంలో కూడా బీజేపీ లీడ్ సాధించడం టీఆర్ఎస్ శ్రేణులను షాక్ కు గురి చేస్తోంది.
Etela Rajender
BJP
Huzurabad
TRS

More Telugu News