Raviteja: రవితేజ టైటిల్ పోస్టర్ కి ముహూర్తం ఖరారు!

  • రవితేజ నుంచి రిలీజ్ కి రెడీగా 'ఖిలాడి'
  • చాలావరకూ డ్యూటీ పూర్తి చేసిన 'రామారావు'
  • లైన్లోకి వచ్చేసిన 'ధమాకా'
  • 70వ సినిమా సుధీర్ వర్మతో  
Raviteja in Sudheer Varma movie

రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కొవిడ్ సమయంలో వరుసగా కథలు వినేసిన ఆయన, ఇప్పుడు వాటిని వరుసగా పట్టాలెక్కిస్తున్నాడు. తాజాగా ఆయన తన 70వ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా, సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకి 'రావణాసుర' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. 'హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్' అనేది ట్యాగ్ లైన్. అయితే ఈ విషయంపై ఈ నెల 5వ తేదీన క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఆ రోజున ఉదయం 10:08 నిమిషాలకు టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పారు.

ప్రస్తుతం సుధీర్ వర్మ 'శాకిని - ఢాకిని' సినిమాను చేస్తున్నాడు. ఇది లేడీ ఓరియెంటెడ్ స్టోరీ. ఇక ఆల్రెడీ 'ఖిలాడి'ని రిలీజ్ కి నిలబెట్టేసిన రవితేజ, ఆ తరువాత ప్రాజెక్టులను పరిగెత్తిస్తున్నాడు. శరత్ మండవ దర్శకత్వంలో 'రామారావు ఆన్ డ్యూటీ' .. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో 'ధమాకా' చేస్తున్నాడు. ఇక త్వరలో 'రావణాసుర' అన్నమాట. 

More Telugu News