Etela Rajender: హుజూరాబాద్ ఫలితాలు.. తొలి రౌండ్ లో ఆధిక్యంలో ఈటల రాజేందర్

  • తొలి రౌండ్ లో ఈటలకు 4,610 ఓట్లు
  • టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకి 4,444 ఓట్లు
  • 166 ఓట్ల ఆధిక్యాన్ని సాధించిన ఈటల
Etela Rajender leads in first round of counting in Huzurabad

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాల ట్రెండ్స్ ఉత్కంఠభరితంగా ప్రారంభమయ్యాయి. తొలి రౌండ్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ షాకిచ్చారు. తొలిరౌండ్ ఫలితాలను అధికారులు ప్రకటించారు. తొలి రౌండ్ లో ఈటల రాజేందర్ కు 4,610 ఓట్లు రాగా... టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు 4,444 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు 119 ఓట్లు పడ్డాయి. తొలి రౌండ్ లో ఈటలకు 166 ఓట్ల ఆధిక్యం లభించింది.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, రొట్టెల పీట గుర్తు కొంత వరకు కారు గుర్తును పోలి ఉండటం ఓటర్లను తికమకకు గురి చేసిందని అభిప్రాయపడుతున్నారు. తొలి రౌండ్ లో రొట్టెల పీట గుర్తుపై పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థికి 122 ఓట్లు రావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ కంటే రొట్టెల పీట గుర్తుకు ఎక్కువ ఓట్లు రావడం విశేషం.

మరోవైపు తొలుత లెక్కించిన పోస్టల్ బ్యాలట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం సంపాదించింది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లకు గాను టీఆర్ఎస్ కు 503 ఓట్లు, బీజేపీకి 159 ఓట్లు, కాంగ్రెస్ కు 35 ఓట్లు పోలయ్యాయి. 14 ఓట్లు చెల్లకుండా పోయాయి.

More Telugu News