Gorantla Butchaiah Chowdary: విద్యావ్యవస్థ పతనానికి దారితీసేలా సీఎం మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Jagan is behaving like destroying aided schools says Gorantla Butchaiah Chowdary
  • ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తుల కోసమే వాటిని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు
  • ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావాలనుకుంటున్నారు
  • ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఇచ్చిన జీవోలను ఉపసంహరించుకోవాలి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. విద్యావ్యవస్థ పతనానికి దారి తీసేలా జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తుల కోసమే వాటిని స్వాధీనం చేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమయిందని అన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావాలనే తాపత్రయంలో జగన్ ఉన్నారని దుయ్యబట్టారు. లక్షలాది మంది విద్యార్థులు, వేలాది మంది ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకునే హక్కు జగన్ కి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఇచ్చిన అన్ని జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News